దుర్గి: రాజధాని వాయిస్
మండలంలోని దుర్గి గ్రామానికి చెందిన ఇర్లపాటి ఖాసింబి పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. భర్త, కుమారుడు మరణించడంతో కుమార్తె కూలి పనులు చేస్తూ తల్లిని, తన ఇద్దరు పిల్లలను పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
ఈ విషయం తెలుసుకున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా కృప రక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు గురజాల అప్పారావు ఖాసింబికి ఆరోగ్య పోషకాహారాన్ని అందించడంతో పాటు ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆమెకు నెలకు రూ.15 వేల పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దాతలు సహాయం చేయాలనుకుంటే 9492464919 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఆమె సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
Be the first to share your thoughts on this story!