దేవరంపాడు ఎస్సీ పాఠశాల విద్యాకమిటి చైర్మన్ గా చింతపల్లి చెన్నయ్య,వైస్ చైర్మన్ గా గంటేల కృష్ణ
రాజుపాలెం.సెప్టెంబర్ 29,రాజధాని వాయిస్:
పల్నాడు జిల్లా,సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం,దేవరంపాడు గ్రామంలో ఎస్సీ పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రదానోపాధ్యాయులు కిరణ్ కుమార్ మాష్టార్ ఆద్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పత్తిపాటి వెంకయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్ గా చింతపల్లి చెన్నయ్య,వైస్ చైర్మన్ గా గంటేల కృష్ణ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!