*పల్నాడు ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ని కలసి పల్నాడు జిల్లా దళిత బహుజనుల సమస్యలపై దృష్టి సారించాలని కోరిన డి బి హెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది డాక్టర్ గోదా రమేష్ కుమార్*
*పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న దళిత బహుజనుల సమస్యలపై దృష్టి సారించి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా పోలీస్ అధికారులను ఆదేశించాలని పల్నాడు ఎస్పీ జగదీష్ ని రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు లోని అంబేద్కర్ నగర్ కు చెందిన దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది డాక్టర్ గోదా రమేష్ కుమార్ కోరారు.ఈ రోజు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పల్నాడు ఎస్పీ జగదీష్ ఆదహళ్లి గారిని మర్యాద పూర్వకంగా కలసిన రమేష్ కుమార్ గతంలో పల్నాడు జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ప్రస్తుత ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పల్నాడు జిల్లా లో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ ని శాలువాతో సత్కరించారు.*
Be the first to share your thoughts on this story!