నకరికల్లు ఎసై ఆద్వర్యంలో అవగాహన కార్యక్రమం
నకరికల్లు.అక్టోబర్ 5,రాజధాని వాయిస్:
పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నకరికల్లు కేజీబీవీ పాఠశాలలో ఎస్‌ఐ సతీష్ ఆధ్వర్యంలో మహిళా భద్రత, రోడ్డు భద్రత, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మహిళలను గౌరవించడం, ఆపద సమయంలో దిశ యాప్ పోలీసులను సంప్రదించడం, రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, అలాగే సైబర్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటిపి లు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండడం వంటి అంశాలపై విలువైన సూచనలు చేశారు.
“విద్యార్థులు నేటి భవిష్యత్తు పౌరులు. వారికి సరైన సమయంలో భద్రతపై అవగాహన కల్పిస్తే, వారు తమను తాము రక్షించుకోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులు సమాజాన్ని కూడా అప్రమత్తం చేయగలరు” అని సూచించారు.
పోలీసులు కేవలం నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడమే కాకుండా, నేరాలు జరగకుండా ముందస్తు అవగాహన కల్పించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తారని తెలియజేస్తూ, విద్యార్థుల భద్రత మరియు ప్రజల రక్షణకు నకరికల్లు పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు.ఎస్పీ సూచనల మేరకు ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.
Be the first to share your thoughts on this story!